Drugs: గుజరాత్‌లో ₹1026 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

గుజరాత్‌లో ముంబయి పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంక్లేశ్వర్‌ పట్టణంలోని ....

Published : 16 Aug 2022 22:07 IST

ముంబయి: గుజరాత్‌లో ముంబయి పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంక్లేశ్వర్‌ పట్టణంలోని మెఫెడ్రోన్‌ (ఎండీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ) యూనిట్‌లో 500 కిలోలకు పైగా నిషేధిత మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. వీటి విలువ దాదాపు రూ.1026కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ గురించి తమకు అందిన సమాచారంతో ముంబయిలోని వర్లి పోలీస్‌ విభాగానికి చెందిన యాంటీ నార్కొటిక్స్‌ విభాగం ఆగస్టు 13న ఆ యూనిట్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 513 కిలోల సింథటిక్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ఆ డ్రగ్‌ యూనిట్‌ యజమాని గిరిరాజ్‌ దీక్షిత్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని