నా రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైంది

తన అసలైన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

Updated : 14 Feb 2021 11:42 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌..

వాషింగ్టన్‌: అబిశంసన గండం నుంచి గట్టెక్కిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన అసలైన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందని ప్రకటించారు. సెనేట్‌ ఓటింగ్‌ ముగిసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘అమెరికాను మళ్లీ ఉన్నతంగా మార్చేందుకు ఉద్దేశించిన చారిత్రక, దేశభక్తి పూర్వకమైన, గొప్ప ఉద్యమం (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-మాగా) ఇప్పుడే మొదలైంది. రానున్న కొద్ది నెలల్లో నేను మీతో చాలా విషయాలు పంచుకుంటాను’’ అంటూ ప్రకటించారు. మరింత దేదీప్యమానమైన, అవధులు లేని అమెరికా భవిష్యత్తును అందరూ సమైక్యంగా సాధించాల్సి ఉందని ట్రంప్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో చేయాల్సిన కృషి ఎంతో ఉందని.. ఇందుకుగాను తన అసమానమైన ప్రయాణాన్ని ప్రజలందరితో కలసి సాగిస్తానన్నారు.

అభిశంసన తీర్మానానికి సంబంధించిన ఓటింగ్‌లో మొత్తం వంద మంది సెనేట్‌ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ట్రంప్‌కు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. కాగా, తన సొంత రిపబ్లికన్‌ పార్టీకే చెందిన ఏడుగురు సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం.

ఇవీ చదవండి..

గట్టెక్కిన ట్రంప్‌..

 మయన్మార్‌: నిరసనలపై ఉక్కు పాదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని