NEET 2022: నీట్‌ పరీక్షలో దారుణాలు.. అమ్మాయిల లోదుస్తులు విప్పించి పరీక్షకు అనుమతి

వైద్య కళాశాల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ 2022 పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో తనిఖీల పేరుతో అవమానకర ఘటనలు చోటుచేసుకున్నట్లు తాజాగా బయటకొచ్చింది. డ్రెస్‌కోడ్‌

Published : 18 Jul 2022 18:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైద్య కళాశాల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ 2022 పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో తనిఖీల పేరుతో అవమానకర ఘటనలు చోటుచేసుకున్నట్లు తాజాగా బయటకొచ్చింది. డ్రెస్‌కోడ్‌ అని చెప్పి విద్యార్థినుల లోదుస్తులు విప్పించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కేరళలోని కొల్లాంలోని మార్థోమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.

నీట్‌ పరీక్ష డ్రెస్‌ కోడ్‌ నిబంధనల్లో భాగంగా మెటల్‌(లోహపు) వస్తువులతో వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అంటే బెల్టులు వంటివి పెట్టుకునేందుకు అనుమతి ఉండదు. అయితే కొల్లాంలోని ఓ పరీక్షా కేంద్రంలో దాదాపు 100 మంది విద్యార్థినులను లోదుస్తులు విప్పేసి లోపలికి వెళ్లాలని అక్కడి సిబ్బంది ఆదేశించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిలు ఆ నిబంధనను పాటించాల్సి వచ్చింది. పరీక్ష అనంతరం విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షకు ముందు ఇలాంటి తనిఖీలతో తాము మానసికంగా వేదనకు గురయ్యామని బాధిత అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆరోపణలను మార్థోమా కాలేజీ తోసిపుచ్చింది. తమ కాలేజీలో కేవలం పరీక్ష నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చామని, తనిఖీలు, బయోమెట్రిక్‌ తదితర అన్ని వేరే వ్యక్తులు చూసుకున్నారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని