Cabinet: సీట్లోకి మంత్రులు.. సాయంత్రం భేటీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. ఆయా మంత్రులు తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. దీంతో కొత్త మంత్రివర్గం నేడు

Updated : 08 Jul 2021 14:04 IST

దిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. ఆయా మంత్రులు తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. దీంతో కొత్త మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. గురువారం సాయంత్రం కేంద్ర కేబినెట్‌, మంత్రవర్గ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు కేబినెట్‌, రాత్రి 7 గంటలకు మంత్రివర్గ సమావేశాలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త మంత్రులతో ప్రధాని మోదీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. 

బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్‌ హోదా, మిగతా 28 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఆ తర్వాత శాఖలను కేటాయించారు. దీంతో గురువారం ఉదయం నుంచి కొత్త మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించారు. హర్‌దీప్‌ సింగ్‌ పూరి, అనురాగ్ ఠాకూర్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, ధర్మేంద్ర ప్రదాన్‌, కిరణ్‌ రిజిజు, కిషన్‌ రెడ్డి, రాజీవ్‌ చంద్రశేఖర్‌, దన్వే రావ్‌ సాహెబ్‌ దాదారావ్‌, డా. బారతీ ప్రవీణ్‌ పవార్‌, దర్శన విక్రమ్‌ జర్దోష్‌, అశ్విని వైష్ణవ్‌ తదితరులు నేడు తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని