MBBS In China: చైనాలో ఎంబీబీఎస్‌.. విద్యార్థులకు మెడికల్‌ కమిషన్‌ హెచ్చరిక!

చైనాలో ఎంబీబీఎస్‌ అభ్యసించాలని భావిస్తోన్న విద్యార్థులకు భారత నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే చైనాలోని వైద్య కళాశాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారో వారంతా ఆ దేశంలో అమలు చేస్తోన్న కఠినమైన కొవిడ్‌ ఆంక్షలు, వీసా నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని

Published : 12 Feb 2022 02:23 IST

దిల్లీ: చైనాలో వైద్యవిద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే చైనాలోని వైద్య కళాశాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారో వారంతా ఆ దేశంలో అమలు చేస్తున్న కఠినమైన కొవిడ్‌ ఆంక్షలు, వీసా నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఇటీవల చైనాలోని కొన్ని యూనివర్సిటీలు వైద్యవిద్యకు అడ్మిషన్లు ప్రారంభిస్తున్న విషయం భారత విదేశాంగశాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎంసీ ద్వారా భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 

భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తుంటారు. అయితే, 2020లో కరోనా నేపథ్యంలో చైనా.. లాక్‌డౌన్‌ విధింపు, వీసాల జారీ నిలిపివేత సహా కఠినమైన కొవిడ్‌ నిబంధనల్ని అమలు చేసింది. దీంతో భారత విద్యార్థులు స్వదేశానికి రాలేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సాయంతో వారంతా భారత్‌కు చేరుకున్నారు. అయితే, చైనా ఇంకా ఆంక్షలను ఎత్తివేయకపోవడంతో విద్యార్థులు తిరిగి చైనాకి వెళ్లి విద్యను కొనసాగించే వీలు లేకుండాపోయింది. కొన్ని యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో కోర్సును కొనసాగించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్‌ ఎంబీబీఎస్‌ను ఎన్‌ఎంసీ అంగీకరించదు. మరోవైపు విద్యార్థుల ప్రయాణాలపై చైనా ఇంకా నిషేధాన్ని ఎత్తివేయలేదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలని, అడ్మిషన్లపై పూర్తి వివరాలను తెలుసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని