ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అదృశ్యం.. కేసు నమోదు! 

దేశంలో కరోనా విరుచుకుపడుతుండటంతో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో పలు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో....

Published : 23 Apr 2021 18:06 IST

చండీగఢ్‌: దేశంలో కరోనా విరుచుకుపడుతుండటంతో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో పలు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణాలోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యం కావడం కలకలం రేపింది.  హరియాణాలోని పానిపట్‌ నుంచి సిర్సాకు ఆక్సిజన్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యంపై కేసు నమోదు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పానిపట్ జిల్లా డ్రగ్‌ కంట్రోలర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పానిపట్‌ ప్లాంట్‌లో నింపిన తర్వాత ట్రక్కు సిర్సాకు బయల్దేరినట్టు చెప్పారు. అయితే, ఆ వాహనం గమ్యస్థానానికి చేరలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని