Pakistan: పాకిస్థాన్‌లో మహిళా ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష.. ఎందుకో తెలుసా?

దైవ దూషణకు పాల్పడిన ఓ పాఠశాల మహిళా ప్రిన్సిపల్‌కు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని నిష్తార్‌ కాలనీలో ఉండే ఓ ప్రైవేటు పాఠశాల మహిళా ప్రన్సిపల్‌......

Published : 28 Sep 2021 17:17 IST

లాహోర్‌: పాకిస్థాన్‌లో దైవ దూషణకు పాల్పడిన ఓ పాఠశాల మహిళా ప్రిన్సిపల్‌కు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని నిష్తార్‌ కాలనీలో ఉండే ఓ ప్రైవేటు పాఠశాల మహిళా ప్రన్సిపల్‌ దైవదూషణకు పాల్పడ్డారని ధ్రువీకరిస్తూ... జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం ఆమెకు మరణశిక్షతోపాటు 5000 పాకిస్థానీ రూపాయలను జరిమానా విధించింది.

ప్రిన్సిపల్‌ సల్మా తన్వీర్‌ దైవ దూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్థానిక మతాధికారి ఫిర్యాదుతో లాహోర్‌ పోలీసులు ఆమెపై 2013లో కేసు నమోదు చేశారు. తన క్లైంట్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని సల్మా తన్వీర్‌ తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు వెల్లడించారు. అయితే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మెడికల్ బోర్డ్ నివేదిక ప్రకారం.. ఆమె మానసిక పరిస్థితి సరిగానే ఉందని తేలింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు ఆమెకు మరణశిక్షతోపాటు జరిమానా విధించింది.

పాకిస్థాన్‌లో దైవ దూషణను తీవ్రమైన తప్పుగా భావిస్తారు. దైవ దూషణకు పాల్పడేవారికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. 1987 నుంచి పాకిస్థాన్‌లో దైవదూషణ చట్టం కింద కనీసం 1,472 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడినవారి తరఫున వాదించేందుకు న్యాయవాదులు సైతం నిరాకరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని