Covid vaccine: మేం కూడా టీకా బుకింగ్‌లో సహకరిస్తాం

కొవిడ్ టీకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రజలకు సహకరించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. దానిలో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు పేటీఎం, మేక్‌ మై ట్రిప్, ఇన్ఫోసిస్‌తో సహా 15 సంస్థలు కేంద్రం అనుమతి కోరాయి. ఈ విషయాన్ని కొవిన్ చీఫ్ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. 

Published : 11 Jun 2021 22:36 IST

ముందుకొచ్చిన పేటీఎం, ఇన్ఫోసిస్‌ సహా 15 సంస్థలు

​​​​​​

దిల్లీ: కొవిడ్ టీకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రజలకు సహకరించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. దానిలో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు పేటీఎం, మేక్‌ మై ట్రిప్, ఇన్ఫోసిస్‌తో సహా 15 సంస్థలు కేంద్రం అనుమతి కోరాయి. ఈ విషయాన్ని కొవిన్ చీఫ్ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. 

టీకా బుకింగ్‌ను సులభతరం చేసేందుకు, అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు థర్డ్ పార్టీ యాప్స్‌నకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ క్రమంలో సుమారు 15సంస్థలు కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అపోలో, మ్యాక్స్‌ వంటి దిగ్గజ వైద్యసంస్థలతో పాటు ఆన్‌లైన్ ఫార్మసీ 1ఎంజీ కూడా వాటిలోఉంది. ఇవన్నీ భారతీయులకు చేరువైన సంస్థలు కావడంతో టీకా బుకింగ్ మరింత సౌలభ్యంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పేటీఎంకు నెలకు 100 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా.. మేక్‌ మై ట్రిప్ సంఖ్య 12 మిలియన్లుగా ఉంది. ప్రభుత్వ పోర్టల్ గురించి తెలియని వారికి ఇవి ఉపయోగపడనున్నాయి. ‘ఈ నిర్ణయం దేశానికి ఉపకరించనుంది. ఒక్కదానిపైనే ఆధారపడేకంటే..అన్ని సంస్థలూ కలిసి పనిచేస్తే ఉత్తమంగా ఉంటుంది’ అని శర్మ అన్నారు. మరోపక్క ఇప్పటివరకు దేశ జనాభాలో 3.5 శాతం మంది మాత్రమే రెండు డోసులు పొందారు. అలాగే జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద కేంద్రం 24.60కోట్ల డోసులను పంపిణీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని