Ayodhya Airport: రామాలయ ప్రారంభోత్సవం వేళ.. అయోధ్యలో అడుగుపెట్టిన తొలి విమానం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి ఓ విమానం దిగింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 23 Dec 2023 17:12 IST

అయోధ్య: రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం (Ayodhya International Airport)లో తొలిసారి ఓ విమానం దిగింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో తొలిసారి ఓ విమానం ల్యాండ్‌ అయ్యింది. భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక పునరుజ్జీవం పట్ల ప్రభుత్వ నిబద్ధత, అయోధ్యను ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచే విషయంలో ప్రధాని మోదీ అంకితభావానికి ఇది నిదర్శనం’ అని పేర్కొన్నారు.

‘బ్రహ్మచారి’ భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

అయోధ్యలో గతంలో 178 ఎకరాల విస్తీర్ణంలో చిన్న ఎయిర్‌స్ట్రిప్‌ను.. రూ.350 కోట్లతో మర్యాద పురుషోత్తం శ్రీరామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఈ నెల 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి సింధియా వెల్లడించారు. తొలి విడతలో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుందని తెలిపారు. గంటకు రెండు, మూడు విమానాలను హ్యాండిల్‌ చేయగలదన్నారు. 2,200 మీటర్ల పొడవైన రన్‌వే అందుబాటులోకి రానుందని, దీంతో బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ 319, 320 విమానాలు ఇక్కడ ల్యాండ్‌ చేయొచ్చని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని