
ప్రధాని ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సిన్హా రాజీనామా
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న పీకే సిన్హా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆయన రాజీనామాకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన పీకే సిన్హా.. 18 నెలల పాటు పీఎంవోలో పనిచేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేబినెట్ కార్యదర్శిగానూ పనిచేశారు. 2019 సెప్టెంబర్‌లో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ పీఎంవో ముఖ్య సలహాదారుగా నియమించారు.
యూపీ క్యాడర్‌కు చెందిన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పీకే సిన్హా.. కేంద్రంలో నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేబినెట్ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి రిటైర్ అయ్యారు. అయితే, అప్పట్లో ఆయన్ను పీఎంవో ఓఎస్డీగా నియమించారు. అనంతరం మరో సీనియర్ అధికారి నృపేంద్ర మిశ్రా పీఎంవో నుంచి వైదొలగిన తర్వాత పీకే సిన్హాను ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. యూపీఏ హయాంలో కూడా ముగ్గురు కేంద్ర మంత్రుల వద్ద సిన్హా కార్యదర్శిగా పనిచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.