Prakash Raj: చంద్రయాన్‌ 3పై ట్వీట్‌.. ప్రకాశ్‌ రాజ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

చంద్రయాన్‌-3పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన ట్వీట్‌కు సంబంధించి కర్ణాటకలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు నమోదైంది.

Published : 22 Aug 2023 16:50 IST

బాగల్‌కోట్‌: చంద్రయాన్‌-3పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు ప్రకాశ్‌ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేశారని వారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.

‘చంద్రయాన్‌-3పై సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుకు సంబంధించి ఓ ఫిర్యాదు అందింది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మిషన్‌పై అభ్యంతరకర ట్వీట్‌ చేసినందుకుగానూ ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొందరు హిందూ సంస్థల ప్రతినిధులు డిమాండు చేశారు’ బాగల్‌కోట్‌లోని బనహట్టి పోలీసులు వెల్లడించారు.

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. ఆ ‘17 నిమిషాలు’ టెన్షన్‌ టెన్షన్‌..!

ఇదిలాఉంటే, చంద్రయాన్‌-3 ప్రయోగం కీలక దశకు చేరిన సమయంలో... ‘విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి నుంచి పంపుతున్న మొదటి ఫొటో’ అనే వ్యాఖ్యకు ఒక వ్యక్తి టీ తయారు చేస్తున్న ఫొటోను జోడించి ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇది తమ నాయకుడిని ఉద్దేశించే పోస్టు చేశారని కొందరు విమర్శించగా.., దేశ ప్రగతి, ప్రతిభను సహించలేక ప్రకాశ్‌రాజ్‌ ఇలా స్పందించారని మరికొందరు నెటిజన్లు దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని