Droupadi Murmu: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము.. వీడియో వైరల్‌

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిల్లీ మెట్రోలో ప్రయాణించారు. సామాన్య ప్రయాణికుల వలే మెట్రో రైల్లో కూర్చుని విద్యార్థులతో ముచ్చటించారు.

Published : 07 Feb 2024 14:24 IST

దిల్లీ: నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని దిల్లీలోని మెట్రో రైల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్‌ను వదిలి సామాన్యురాలిలా కొంతసేపు మెట్రో రైలు (Metro Rail)లో ప్రయాణించారు. విద్యార్థులతో ముచ్చటించారు. రైల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ వికాస్‌ కుమార్‌ ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhawan)కు సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను డీఎంఆర్‌సీ ఎండీ వికాస్‌ కుమార్‌ రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు.

కుమార్తె పెళ్లిలో అతిథులకు హెల్మెట్లు పంచిన తండ్రి

అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొఘల్‌ గార్డెన్స్‌తో పాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్‌ ఉద్యాన్‌-2024 (Amrit Udyan)’ను ఇటీవల ప్రారంభించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యటకుల కోసం దిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నాలుగో గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లొచ్చని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని