ఛత్తీస్‌గఢ్‌లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్‌రాయ్‌ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు.

Published : 06 May 2024 03:16 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్‌రాయ్‌ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ అధికారులు ఇచ్చిన పిలుపుతో 35 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిలో జియాకోడ్‌ పంచాయతీ మిలీషియా ప్లాటూన్‌ కమాండర్‌ బమన్‌ కర్తామ్‌, అరన్‌పుర్‌ పంచాయతీ చేతన నాట్యమండలి అధ్యక్షుడు బీమా కుంజం, హుర్రేపాల్‌ పంచాయతీ క్రాంతికారి మహిళా ఆదివాసీ సంస్థాన్‌ అధ్యక్షురాలు కుమ్మే లేఖమ్‌, బాలిక, బాలుడు ఉన్నారు. వారిలో ముగ్గురిపై దాదాపు లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని