Kerala: సమాధిపై క్యూఆర్‌ కోడ్‌!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి

సెంట్రల్‌ కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కురియాచిరా పట్టణానికి చెందిన సెయింట్‌ జోసెఫ్‌ చర్చిని సందర్శించిన ఎవరైనా అక్కడ ఓ సమాధి పలకపై పెద్ద సైజులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ చూస్తే విస్తుపోతారు.

Updated : 23 Mar 2023 11:03 IST

సెంట్రల్‌ కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కురియాచిరా పట్టణానికి చెందిన సెయింట్‌ జోసెఫ్‌ చర్చిని సందర్శించిన ఎవరైనా అక్కడ ఓ సమాధి పలకపై పెద్ద సైజులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ చూస్తే విస్తుపోతారు. 26 ఏళ్ల వయసులో అకాల మరణానికి గురైన యువ వైద్యుడు ఐవిన్‌ ఫ్రాన్సిస్‌ సమాధి అది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. డాక్టర్‌ ఐవిన్‌ జీవిత విశేషాలు, అతడి సృజనాత్మక ప్రతిభ తాలూకు వీడియోలు చూడవచ్చు. వైద్యుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడు చిన్న వయసులోనే తమకు దూరం కావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఐవిన్‌ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలన్న తలంపుతో ఈ ఏర్పాటు చేశారు. డాక్టర్‌ ఐవిన్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఓ వెబ్‌ పేజీ రూపొందించిన అతడి కుటుంబం క్యూఆర్‌ కోడ్‌తో దాన్ని అనుసంధానం చేసింది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఐవిన్‌ చిత్రాలు, కళాశాలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, మిత్రుల వివరాలు అన్నీ చూడవచ్చు. 2021లో బ్యాడ్మింటన్‌ ఆడుతూ కుప్పకూలిపోయిన డాక్టర్‌ ఐవిన్‌ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని