Rakesh Tikait: రైతన్నలను ఇబ్బంది పెట్టాలని చూస్తే... : కేంద్రానికి టికైత్‌ వార్నింగ్‌

Farmers Protes: ప్రస్తుతం నిరసన తెలుపుతోన్న రైతులకు తమ మద్దతు ఉంటుందని బీకేయూ చీఫ్ రాకేశ్‌ టికైత్‌ (Rakesh Tikait) వెల్లడించారు. 

Updated : 13 Feb 2024 19:18 IST

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం దిల్లీ బయలుదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఉండిపోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌( BKU) చీఫ్ రాకేశ్‌ టికైత్‌ హెచ్చరించారు. ‘దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానిది ఒక్కో సమస్య. ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం దిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు. మేం వారికి దూరంగా లేము. అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని టికైత్‌ మీడియాతో మాట్లాడారు.

గతంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020-21లో అన్నదాతలు చేపట్టిన నిరసనలో రాకేశ్‌ కీలకపాత్ర పోషించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో తాజాగా ‘దిల్లీ చలో’ పేరిట భారీ మార్చ్‌ తలపెట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. అయితే పంజాబ్‌, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు( Shambhu border) వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆ ఉద్రిక్తతల నేపథ్యంలోనే టికైత్‌ వార్నింగ్ వచ్చింది. ఇదిలాఉండగా.. రైతుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్‌ టికైత్‌ కోరారు.

‘6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్‌’: సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు

భారతీయ కిసాన్ యూనియన్.. ఉత్తర్‌ప్రదేశ్‌ కేంద్రంగా నడుస్తోన్న రైతుసంఘం. దీని వ్యవస్థాపకుల్లో మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) కూడా ఒకరు. ఆయనకు ఇటీవల కేంద్రం ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు