RBI: ఓపీఎస్‌కు మళ్లితే ఆర్థిక భారం తప్పదు.. రాష్ట్రాలను హెచ్చరించిన ఆర్‌బీఐ

పాత పింఛను పథకం (ఓపీఎస్‌) విధానానికి మళ్లుతున్న రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హెచ్చరించింది.

Updated : 18 Jan 2023 08:56 IST

ముంబయి: పాత పింఛను పథకం (ఓపీఎస్‌) విధానానికి మళ్లుతున్న రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల రాబడులు వ్యయాల మధ్య సమతౌల్యం లోపించి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని పేర్కొంది. ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు: 2022-23 బడ్జెట్‌ల పరిశీలన’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఉద్యోగులకు ఓపీఎస్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం దీని అమలుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఓపీఎస్‌ను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పింఛను నిధి నియంత్రణ, అభివృద్థి సంస్థ(పీఎఫ్‌ఆర్‌డీఏ)కు తెలియజేశాయి. పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఓపీఎస్‌ అమలుకు సంబంధించి గత ఏడాది నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని