Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు

అమెరికాలో (America) నిర్వహించే కార్యక్రమాలకు తాను హాజరవుతానని చెప్పి కొందరు మోసాలకు పాల్పడుతున్నారని రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 25 Sep 2023 02:04 IST

బెంగళూరు : ఇన్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా, రచయిత్రిగా సుధామూర్తి (Sudha Murty) అందరికీ సుపరిచితమే. అమెరికాలో (America) జరిగే ఈవెంట్లకు ఆమె హాజరవుతారని పేర్కొంటూ కొందరు డబ్బులు వసూలు చేశారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల పేరు చెప్పి నగదు వసూలు చేస్తున్నారన్న విషయం సుధామూర్తి దృష్టికి రావడంతో ఆమె సీరియస్‌గా స్పందించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్ మమత సంజయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసినట్టు సమాచారం.

పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు

కన్నడకూట నార్తన్‌ కాలిఫోర్నియా (కేకేఎన్‌సీ) 50వ వార్షికోత్సవం సందర్భంగా సుధామూర్తికి తొలుత ఆహ్వానం అందింది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ తాను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ఆగస్టు 30న ఆమె దృష్టికి వచ్చింది. ఈ విషయంపై కేకేఎన్‌సీ ప్రతినిధులను సంప్రదించగా.. లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి మోసం చేసినట్లు తేలింది.  

మరో ఘటనలో అమెరికాలో సెప్టెంబరు 26న జరిగే ‘మీట్ అండ్‌ గ్రీట్’ కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారంటూ శ్రుతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసింది. ఈ ప్రకటన సుధామూర్తి కార్యాలయం దృష్టికి రావడంతో ఆమె అప్రమత్తమయ్యారు. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడిన మహిళలు ఇండియాలోనే ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని