Covaxin: 6న కొవాగ్జిన్‌పై డబ్ల్యూహెచ్‌వో నిపుణుల సమావేశం

అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌) కోసం దరఖాస్తు చేసుకున్న భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం అక్టోబర్‌ 6న సమావేశం కానుంది. ఆ భేటీలోనే డబ్ల్యూహెచ్‌వోకి

Updated : 20 Sep 2021 08:08 IST

అందులోనే అత్యవసర వినియోగంపై నిర్ణయం!

హైదరాబాద్‌: అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌) కోసం దరఖాస్తు చేసుకున్న భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం అక్టోబర్‌ 6న సమావేశం కానుంది. ఆ భేటీలోనే డబ్ల్యూహెచ్‌వోకి సలహాలిచ్చే ఇమ్యునైజేషన్‌ నిపుణుల వ్యూహాత్మక సలహా బృందం (ఎస్‌ఏజీఈ) ‘కొవాగ్జిన్‌’ టీకా మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను విశ్లేషించనుంది. ఇప్పటికే టీకాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఆరున జరిగే సమావేశంలోనే భారత్‌ బయోటెక్‌ కూడా టీకాకు సంబంధించిన అంశాలను నిపుణుల బృందానికి వివరించనుంది. వీటితో సంతృప్తి చెందితే ఎస్‌ఏజీఈ.. అత్యవసర వినియోగంపై డబ్ల్యూహెచ్‌వోకు సిఫార్సు చేస్తుంది. అదే జరిగితే కొవిడ్‌-19 అత్యవసర వినియోగ టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ కూడా చేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని