Precaution dose: ముందు జాగ్రత్త డోసు.. వృద్ధులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం

ముందుజాగ్రత్త( ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెలుసుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అందిచాల్సిన/అప్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది. మంగళవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. 

Published : 28 Dec 2021 17:54 IST

దిల్లీ: ముందుజాగ్రత్త( ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెలుసుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అందిచాల్సిన/అప్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది. మంగళవారం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. 

వైద్యుడి దగ్గరినుంచి తమ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి పత్రాలు తీసుకురాకపోయినా 60 ఏళ్లు పైబడిన వారు ముందుజాగ్రత్త డోసు తీసుకోవచ్చని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే టీకా తీసుకునే ముందు వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది. అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని కేంద్రం ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న తరుణంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు అందించనున్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 39 వారాలు దాటిన తర్వాతే ఈ ముందు జాగ్రత్త డోసు స్వీకరించడానికి అర్హత లభిస్తుందని నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి జనవరి మూడు నుంచి టీకా అందించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని