Parliament: విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం.. లోక్‌సభ వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్‌, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో గురువారం కూడా ఉభయ సభల్లో వాయిదా

Updated : 29 Jul 2021 11:23 IST

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్‌, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో గురువారం కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో బుధవారం కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు, పత్రాలు చించి వాటిని స్పీకర్‌ స్థానం వైపు, అధికార పక్షం వైపు విసిరి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార ఎంపీలు కూడా విపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంట మొదలుపెట్టకుండానే సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. 

అటు పెద్దల సభలోనూ ఇదే గందరగోళ పరిస్థితి కన్పించింది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని