e-Auction: రూ.10 కోట్లతో దూసుకుపోతున్న మన ఒలింపియన్ల గ్లోరీ..!

టోక్యో ఒలింపిక్స్‌లో దేశం దృష్టిని ఆకర్షించిన క్రీడాకారులు ఉపయోగించిన వస్తువులకు ఈ వేలంలో మంచి ఆదరణ లభిస్తోంది. రెండో రోజు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఈటె, బాక్సింగ్ సంచలనం లవ్లీనా బోర్గొహేన్ గ్లౌజులకు రూ. 10 కోట్ల ధర లభించింది. అలాగే పారా ఒలింపియన్, స్వర్ణంతో ఆకట్టుకున్న సుమిత్ అంటిల్ ఈటె రూ.3 కోట్ల ధర పలికింది. 

Updated : 19 Sep 2021 05:25 IST

వేలంలో నీరజ్ ఈటె, లవ్లీనా గ్లౌజులకు రూ.10 కోట్లు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో దేశం దృష్టిని ఆకర్షించిన క్రీడాకారులు ఉపయోగించిన వస్తువులకు ఈ వేలంలో మంచి ఆదరణ లభిస్తోంది.  స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఈటె, బాక్సింగ్ సంచలనం లవ్లీనా బోర్గొహేన్ గ్లౌజులకు రూ. 10 కోట్ల ధర లభించింది. అలాగే పారా ఒలింపియన్, స్వర్ణంతో ఆకట్టుకున్న సుమిత్ అంటిల్ ఈటె రూ.3 కోట్ల ధర పలికింది. 

శుక్రవారం నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని..వివిధ సందర్భాలు, పర్యటనల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల వస్తువులను కూడా వేలానికి ఉంచారు. నీరజ్ చోప్రా ఈటె కోటి రూపాయల ధరతో ప్రారంభం కాగా, ప్రస్తుతం రూ.10 కోట్లకు చేరింది. లవ్లీనా చేతి గ్లౌజులకు రూ.80లక్షల ప్రారంభ ధర దక్కగా.. ఇప్పుడు రూ. 10 కోట్లు పలికింది. సింధు రాకెట్ రూ.2 కోట్ల వద్ద, ఒలింపిక్స్‌లో ఆటతీరుతో మెప్పించిన హాకీ అమ్మాయిల స్టిక్ కోటి రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. 

కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ వేలం కొనసాగనుంది. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్‌ వేసిన వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని