Omicron: అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం వాయిదా

అంతర్జాతీయ విమాన సేవలను ఈ నెల 15న పునఃప్రారంభించకూడదని బుధవారం ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

Updated : 02 Dec 2021 06:59 IST

దిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలను ఈ నెల 15న పునఃప్రారంభించకూడదని బుధవారం ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వీటిని మళ్లీ ప్రారంభించాలని ఒక వారం క్రితమే భావించినప్పటికీ, కరోనా ఒమిక్రాన్‌ ఉత్పరివర్తనం నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చుకొంది. పరిస్థితులను గమనిస్తున్నామని, వీటిని ఎప్పుడు ప్రారంభించేదీ మళ్లీ తెలియజేస్తామని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది. ప్రస్తుతం ద్వైపాక్షిక ఎయిర్‌ బబుల్‌ ఏర్పాట్లలో భాగంగా 31 దేశాలకు మాత్రమే పరిమితంగా విమానాలు నడుస్తున్నాయి. 

ముప్పులేని దేశాలకు వెసులుబాటు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయమై పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ముప్పు (రిస్కు) ఉన్న దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కేవలం రెండు శాతం ప్రయాణికులు మాత్రమే రిస్కులేని దేశాల నుంచి వస్తున్నారని, అలాంటి వారు విమానాశ్రయంలోనే కరోనా పరీక్షకు సంబంధించిన నమూనాలు ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవచ్చని సూచించింది. ముప్పు లేని దేశాల నుంచి వచ్చే అందర్నీ కాకుండా, ఎంపిక చేసిన కొందరికే పరీక్షలు చేస్తే సరిపోతుందని తెలిపింది. ప్రయాణంలో భాగంగా ముప్పు ఉన్న దేశాల్లోని విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు గడిపితే అలాంటి వారికి కూడా పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని