ప్రియాంక ఇన్‌స్టాగ్రాం హ్యాకింగ్ ఆరోపణలు.. సీరియస్‌గా తీసుకున్న కేంద్రం..!

తన పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకునట్లు తెలుస్తోంది.

Published : 22 Dec 2021 17:13 IST

దిల్లీ: తన పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అడ్వాన్స్‌డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్‌తో దర్యాప్తు చేయించనున్నట్లు సంబందిత వర్గాల సమాచారం. హ్యాకింగ్‌ గురించి ప్రియాంక అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, కేంద్రమే సొంతంగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐటీ శాఖ పరిధిలో పనిచేసే  CERT-in ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ఇది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఈ టీమ్ అడ్వాన్స్‌డ్ ల్యాబ్‌ను నడుపుతోంది. అది హ్యాకర్లను గుర్తించడమే కాకుండా, సైబర్ దాడులను నివారిస్తుంది.

గత కొద్ది నెలల్లో జరగనున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. యూపీ ప్రభుత్వం తమ పోన్లను ట్యాప్‌ చేసి, తమ మాటలు వింటోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు చేశారు. వీటిపై మీడియా ప్రియాంకను ప్రశ్నించగా.. ‘ఫోన్‌ ట్యాపింగ్ సంగతి అలా ఉంచండి. నా పిల్లల ఇన్‌స్టాగ్రాం ఖాతాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. వాళ్లకు ఇంకే పనిలేదా’ అంటూ కేంద్రంపై విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని