Second Wave: 624 మంది డాక్టర్లు బలి
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. తొలిదశ కంటే రెండో దశలో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది. సాధారణ ప్రజల మాట అటుంచితే.. కరోనాపై పోరాడుతున్న వారిలో ముందువరుసలో ఉన్న వైద్యులే ఈ మహమ్మారికి బలవ్వడం మింగుడు పడటం లేదు
దిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. తొలిదశ కంటే రెండో దశలో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది. సాధారణ ప్రజల మాట అటుంచితే.. కరోనాపై పోరాడుతున్న వారిలో ముందువరుసలో ఉన్న వైద్యులే ఈ మహమ్మారికి బలవ్వడం మింగుడు పడటం లేదు. రెండోదశ వ్యాప్తిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 624 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) తాజాగా వెల్లడించింది. అత్యధికంగా దిల్లీలో 109 మంది కరోనాకు బలైనట్లు తెలిపింది. బిహార్‌లో 96 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసింది. కరోనా రెండోదశ వ్యాప్తి సమయంలో తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలో 23 మంది వైద్యులు అసువులు బాశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది, ఝార్ఖండ్‌లో 39 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 34 మంది, తెలంగాణలో 32 మంది, గుజరాత్లో 21 మంది వైద్యులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ వెల్లడించింది.
మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు లక్షమంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది ఈ మహమ్మారికి గురయ్యారు. బాధితులకు నిత్యం వైద్యసేవలు అందించడంతోపాటు, రోజులో చాలా సమయం వారితోనే గడపాల్సి రావడంతో చాలామంది వైద్యులకు ఈ మహమ్మారి సోకుతోంది. ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్న వైద్యులు వైరస్ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
రెండోదశ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్ర సమస్య ఏర్పడింది. దీనివల్లే వివిధ ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాకుండా ఇంటెన్సివ్ కేర్‌లో చాలామంది బాధితులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డాక్టర్లకు, నర్సులకు కొవిడ్ సోకినట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ పని గంటలు కూడా వైద్యులపై మానసికంగా, ఆరోగ్య పరంగా ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం