మడమతిప్పని పోరాటం

దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్ద అనేక మంది రైతులు చేరుకోవడంతో సోమవారం ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి....

Updated : 20 Sep 2022 16:18 IST

దిల్లీ: ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశ రాజధాని దిల్లీలో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారంతో వారి నిరసన దీక్షలు 66వ రోజుకు చేరాయి. కర్షకులకు మద్దతుగా పలు ప్రాంతాల నుంచి అన్నదాతలు భారీగా తరలివస్తున్నారు. దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతులు చేరుకోవడంతో సోమవారం ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను నొయిడా వైపు మళ్లించారు.

కేంద్రం నూతనంగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తిన సరిహద్దుల్లో నవంబర్‌ 26 నుంచి అన్నదాతలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగినా అవి ఫలించలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ రణరంగంగా మారింది. కొందరు నిరసనకారులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట పైకి ఎక్కి సిక్కు జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పలువురు రైతు నేతలు, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తమ నేతలను విడుదల చేయాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవీ చదవండి...

గల్లంతైన రైతుల ఆచూకీకి కమిటీ

రైతుల ఉద్యమానికి మద్దతు ఉంటుంది: బాదల్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని