UK PM: మరణిస్తోంది వాళ్లే కదా.. లాక్‌డౌన్‌ వద్దు

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై ఓ మాజీ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వృద్ధులే ఎక్కువగా మరణిస్తుండటంతో కావాలనే రెండోసారి లాక్‌డౌన్‌ విధించలేదని ఆరోపించారు....

Published : 20 Jul 2021 19:32 IST

బ్రిటన్‌ ప్రధానిపై మాజీ ఉన్నతాధికారి ఆరోపణలు

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై ఓ మాజీ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వృద్ధులే ఎక్కువగా మరణిస్తుండటంతో కావాలనే రెండోసారి లాక్‌డౌన్‌ విధించలేదని ఆరోపించారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వద్ద పనిచేసి గతేడాది ఉద్యోగాన్ని వదిలేసిన ఉన్నతాధికారి డొమినిక్‌ కమ్మిన్స్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత శీతాకాలంలో కొవిడ్‌ మరణాల శాతం అధికంగానే ఉన్నా.. అందులో ఎక్కువ శాతం 80 ఏళ్లకు పైబడినవారే మరణిస్తుండటంతో ఉద్దేశపూర్వకంగానే రెండోసారి లాక్‌డౌన్‌ విధించలేదని పేర్కొన్నారు. కొవిడ్‌ బాధితుల కోసం నిత్యావసర మందులను కూడా కొనేందుకు కూడా ఆయన విముఖత చూపారని వెల్లడించారు.

దేశంలో సంభవించిన అనేక మరణాలకు ప్రభుత్వమే కారణమని డొమినిక్‌ కమ్మిన్స్‌ ఆరోపణలు గుప్పించారు. తన కార్యాలయంలో కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయకుండా ప్రధాని పలువురిని కలిశారని తెలిపారు. అనవసరంగా ఎవరినీ కలవకూడదని, ముఖ్యంగా వృద్ధులను కలవకూడదనే నిబంధన ఉన్నా కూడా ఆయన ఎలిజబెత్‌ రాణి (95)ని కలిశారని పేర్కొన్నారు. గత అక్టోబర్‌ నుంచే ప్రధానితోపాటు ఆయన వద్ద పనిచేసే పలువురు అధికారులపై కమ్మిన్స్ ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఈ ఆరోపణలను బోరిస్‌ జాన్సన్‌ ప్రతినిధి కొట్టిపారేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రధాని అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను ప్రధానమంత్రి అమలుచేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని