Delhi Metro: దిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్థానీ రాతల కలకలం

దిల్లీ మెట్రో స్టేషన్‌ (Delhi Metro) గోడలపై ఖలీస్థాన్‌ (Khalistan)కు మద్దతుగా రాతలు వెలిశాయి. మరి కొద్దిరోజుల్లో దిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇవి కలకలం రేపాయి.

Updated : 27 Aug 2023 13:13 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఖలిస్థానీ (Khalistan) మద్దతుదారులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం దిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల (Delhi Metro) గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా గ్రాఫిటీ (రంగులతో స్ప్రే చేయడం)తో రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) పేరుతో ఖలిస్థాన్‌కు మద్దతుగా దిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్‌ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలో రాశారు. 

ఈసారి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌..: అశోక్‌ గహ్లోత్‌

సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 (G20 Summit) సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్‌కు మద్దతుగా రాతలు కలకలం రేపాయి. గతంలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని