ప్రముఖ గాంధేయవాది దొరైస్వామి కన్నుమూత

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య పోరాట యోధుడు హెచ్‌ఎస్‌ దొరైస్వామి కన్నుమూశారు. 103 ఏళ్ల దొరైస్వామి అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని....

Published : 26 May 2021 23:34 IST

బెంగళూరు: ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య పోరాట యోధుడు హెచ్‌ఎస్‌ దొరైస్వామి కన్నుమూశారు. 103 ఏళ్ల దొరైస్వామి అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని జయదేవ ఊపిరిత్తుల వ్యాధుల ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ నెల 8న కరోనా సోకగా ఇదే ఆసుపత్రిలో చేరారు. మే 13న కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు నీరసంగా ఉందని తెలపడంతో ఆయనను మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. దొరైస్వామి ఆస్తమా, ఊపిరిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

దొరైస్వామి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 14 నెలలు జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఆందోళన చేస్తానని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాయడంతో ఆయనను 4 నెలలు జైలులో ఉంచారు. గనుల మాఫియా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించే వరకు ఆయన ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు. దొరైస్వామి మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని