Published : 29 Jan 2022 15:27 IST

Marriage: పూల దండ కారణంగా పెళ్లి క్యాన్సిల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని నిమిషాలు అయ్యుంటే ఆ ఇద్దరూ.. ఒకటైయ్యేవారు. అంతలోనే సీన్‌ అంతా తారుమారైంది. వరుడి ప్రవర్తన వల్ల చివరి నిమిషంలో ఓ పెళ్లి రద్దయిన  సంఘటన  ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఔరేయాలో జరిగింది. వివాహం జరిగే సమయంలో వధూవరులు దండలు మార్చుకుంటుండగా వరుడు ఆకాశ్‌ పూలదండను వధువు మెడలో విసిరేసినట్టుగా వేశాడు. దీంతో తన మనోభావం దెబ్బతిందంటూ పెళ్లికూతురు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దండను విసిరేయడం నచ్చలేదని.. ఈ పెళ్లి చేసుకోనంటూ కరాఖండీగా చెప్పింది. దీంతో ఇరుకుటుంబాల మధ్య గొడవ జరిగి పెళ్లి ఆగిపోయింది. పెద్దలందరూ వధువుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తన మనసు మార్చుకునేందుకు అంగీకరించలేదట. పెళ్లికి హాజరైన అతిథులు వధువు తీరుకి ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా తాను పూల దండను పద్ధతిగానే వరుడు వేశానంటూ వివరణ ఇచ్చాడు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని