Updated : 27/06/2021 09:11 IST

AP News: బండెక్కి..బెదిరించి యువతి దోపిడీ


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: రహదారిపై ఒంటరిగా నిల్చొని.. అటుగా వచ్చే ద్విచక్రవాహనాలను ఆపి అత్యవసరంగా వెళ్లాలంటూ బండెక్కేది ఆ యువతి. సగం దూరం వెళ్లాక దిగిపోయి.. డబ్బులు ఇస్తావా.. అఘాయిత్యానికి పాల్పడ్డావని ఫిర్యాదు చేయాలా అంటూ బెదిరింపులకు దిగేది. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం.. దీనికి తోడు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న 22 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్ల మండలానికి చెందిన యువతి వ్యసనాలకు బానిసైంది. తల్లి లేకపోవడం, తండ్రి ఉన్నా దిశానిర్దేశం చేయకపోవడంతో చదువులేక కూలి పనుల్లో చేరింది. అక్కడ వచ్చే డబ్బులు సరిపోక వాహన దారులను బెదిరించడం ప్రారంభించింది. చిన్న చిన్న దొంగతనాలు చేసినా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. తనను లిఫ్ట్‌ అడిగి బెదిరించి రూ.5 వేలు నగదు, పావు తులం బంగారం తీసుకుందని ఈ నెల 21న విశాఖకు చెందిన యువకుడు రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ టీవీ పుటేజీల ద్వారా ఆమెను గుర్తించి శనివారం అరెస్టు చేశారు. కేసును ఛేదించిన రెండో పట్టణ పోలీసులను డీఎస్పీ అభినందించారు. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని