
Imran Khan: పాక్ ప్రధానికి పదవీగండం.. సొంత పార్టీలోనే తిరుగుబాటు..!
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇమ్రాన్‌కు పెరుగుతోన్న వ్యతిరేకత
కరాచీ: మరికొన్ని రోజుల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలయ్యింది. ఇప్పటికే ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటాయని వెల్లడించగా.. తాజాగా ఆయన పార్టీకి చెందిన అసంతృప్తి నేతలు ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 24 మంది పీటీఐ పార్టీ నేతలు వ్యతిరేక గళం విప్పడంతో ప్రధానమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం ఇమ్రాన్ ఖాన్‌కు ఇబ్బందికరమేనని స్పష్టమవుతోంది.
దేశంలో నెలకొన్న సంక్షోభానికి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విధానాలే కారణమని ఆరోపిస్తూ పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అనంతరం ఆయన భాగస్వామ్య పక్షాలు కూడా విపక్షాల గళాన్ని అందుకున్నాయి. ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించాయి. తాజాగా అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన 24 మంది చట్టసభ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పీటీఐకి చెందిన చట్టసభ సభ్యుడు రాజీ రియాజ్, మరో సభ్యుడు నూర్ ఆలం ఖాన్లు పలు వార్తా ఛానెల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ‘ప్రభుత్వ విధానాలపై దాదాపు 24 మంది సభ్యులము తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. స్థానిక సమస్యలను లేవనెత్తినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు’ అంటూ పీటీఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి చివరి తేదీల్లో ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోన్న నేతలందరూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధికారంలో ఉన్న సింధ్ ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. ఓటింగ్ జరిగే వరకు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, వీటిపై స్పందించిన ఇమ్రాన్ ప్రభుత్వం.. పీటీఐ సభ్యులను మభ్యపెట్టి సింధ్ ప్రభుత్వం అపహరించుకుపోతోందని ఆరోపిస్తోంది. ఇలా విపక్ష, సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న తరుణంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, వ్యతిరేకంగా ఓటువేసే వారిపై చర్యలకు న్యాయపరంగా ఉన్న మార్గాలపై ఇమ్రాన్ ఖాన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
-
Movies News
Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్