Twitter: వీడియో, ఇమేజ్‌, జిఫ్‌.. ఇక మూడు ఒకే ట్వీట్‌లో!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విటర్‌ (Twitter) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీడియోలు, ఇమేజులు, జిఫ్‌లను.. ఇలా మూడింటినీ ఒకే ట్వీట్‌లో పొందుపరిచే సదుపాయాన్ని తాజాగా తీసుకొచ్చింది.

Published : 06 Oct 2022 19:59 IST

దిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విటర్‌ (Twitter) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీడియోలు, ఇమేజ్‌లు, జిఫ్‌లను.. ఇలా మూడింటినీ ఒకే ట్వీట్‌లో పొందుపరిచే సదుపాయాన్ని తాజాగా తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇమేజ్‌లు లేదా వీడియోల్లో ఏదైనా ఒక్కటి మాత్రమే ట్వీట్‌ చేసే సదుపాయం ఉంది. ఇకపై ఈ మూడింటినీ కలిపి ఒకే ట్వీట్‌ చేయొచ్చు.అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు ట్విటర్‌ తెలిపింది.

ట్విటర్‌లో ఏదైనా ట్వీట్‌ చేసేటప్పుడు 280 అక్షరాలు మాత్రమే వినియోగించేందుకు వీలుంది. గతంలో ఈ పరిమితి 140 అక్షరాలుగా ఉండేది. ఈ క్రమంలోనే వీడియో, జిఫ్, ఇమేజ్‌ల ద్వారా మరింత సమాచారాన్ని ఒకే ట్వీట్‌లో యూజర్లు ఇతరులకు తెలియజేసేలా ఈ సదుపాయాన్ని ట్విటర్‌ తీసుకొచ్చింది. గరిష్ఠంగా ఏవైనా నాలుగు ఫైల్స్‌ను అప్‌లోడ్‌చేసే వీలుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ ఉంది. పిక్చర్‌, వీడియోను ఒకే పోస్ట్‌లో పోస్ట్‌ చేసే వీలుంది. 


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని