12th Fail: హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి ‘12th ఫెయిల్‌’ రికార్డు..

చిన్న సినిమాగా విడుదలై హిట్‌ను సొంతం చేసుకున్న ‘‘12th ఫెయిల్‌’’ రికార్డు సృష్టించింది.

Updated : 09 Jan 2024 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’(12th Fail). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. గతేడాది విడుదలైన హాలీవుడ్‌ చిత్రాలకంటే దీని రేటింగ్ ఎక్కువ ఉండడం విశేషం. తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్‌’ (8.4), బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘స్పైడర్ మ్యాన్‌: అక్రాస్‌ది స్పైడర్‌ వెర్స్‌’ (8.6) సినిమాల రేటింగ్స్‌ను దాటి ‘12th ఫెయిల్‌’ 9.2 సాధించింది.

ఈ సినిమా విషయానికొస్తే.. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా  చిత్రబృందం నామినేషన్‌ వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని