బాఫ్టా అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్‌(బాఫ్టా) సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా రెహమాన్‌ను నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై రెహమాన్‌ స్పందించారు.

Published : 30 Nov 2020 23:09 IST

ముంబయి: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్‌(బాఫ్టా) సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా రెహమాన్‌ను నియమించినట్లు బాఫ్టా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై రెహమాన్‌ స్పందించారు. దేశంలోని సినీరంగంలో దాగివున్న ప్రతిభావంతులను వెలికితీసే కార్యక్రమంలో బాఫ్టాతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. 

‘‘కళాకారులకు ఓ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇస్తున్న అపూర్వమైన అవకాశం ఇది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో సంబంధాలు ఏర్పరుచుకోవడమే కాకుండా.. బాఫ్టా విజేతల సలహాలు తీసుకొని.. ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఇది మంచి అవకాశం’ అని ఆయన అన్నారు. భారతదేశంలోని అద్భుతమైన ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించడంలో భారత్‌, బ్రిటిష్ దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాలనేది దీని ఉద్దేశం. బాఫ్టాతో కలిసి పనిచేసేందుకు రెహమాన్‌ ముందుకు వచ్చినందుకు ఆయనకు బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని