సూర్య.. యువకుడిలా మారాడిలా..!

వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరిస్తుంటాడు ఇళయదళపతి సూర్య. మరోసారి వినూత్నమైన పాత్రలో మన ముందుకు రానున్నాడు. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సూర్య వేర్వేరు

Published : 08 Nov 2020 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన సినిమాలతో అభిమానులను అలరిస్తుంటాడు సూర్య. మరోసారి వినూత్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సూర్య వేర్వేరు వయస్సులు ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు విమాన ప్రయాణం అందించాలన్న సంకల్పంతో పరితపించే ఓ యువకుడి పాత్రను సూర్య పోషించాడు. అయితే.. ఈ పాత్రకు సరైన న్యాయం చేసేందుకు నలభయేళ్ల సూర్య చాలా కష్టపడ్డాడట. ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్పినప్పటికీ 27 రోజుల పాటు ఇబ్బందికర డైట్‌ పాటించాడట. మరి యువకుడి పాత్రలో సూర్య నటన గురించి చర్చించాలి అంటే మరికొన్ని రోజులు ఓటీటీ వేదికగా విడుదల కానున్న చిత్రం కోసం వేచి చూడాల్సిందే.

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 30నే విడుదలకావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల నవంబర్‌ 12కు వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్‌. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని