మహమ్మద్‌ ఖయ్యుమ్‌గా..

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో గరుడవేగ అంజి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 30 Aug 2021 07:19 IST

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో గరుడవేగ అంజి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాందిని తమిళరసన్‌, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో ధన్‌రాజ్‌ సీఐ కేశవ్‌ నాయుడుగా కనిపించనుండగా.. మహమ్మద్‌ ఖయ్యుమ్‌గా సునీల్‌ నటిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ప్రచార చిత్రంలో ఆయన లుక్‌ చాలా కొత్తగా ఉంది. ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. సునీల్‌, ధన్‌రాజ్‌ల పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి’’ అని చిత్ర నిర్మాతలు తెలియ  జేశారు. ఈ సినిమాకి సాయి కార్తీక్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని