న్యాయాన్ని గెలిపిస్తానంటున్న సత్యదేవ్‌

సినిమాసినిమాకూ వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సత్యదేవ్‌. ఈసారి మరింత కొత్తగా మన ముందుకు వస్తున్నాడు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తు్న్న ‘తిమ్మరుసు’లో సత్యదేవ్‌ లాయర్‌ అవతారమెత్తాడు. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న

Published : 09 Dec 2020 22:20 IST

ఆసక్తికరంగా ‘తిమ్మరుసు’ సినిమా టీజర్‌

హైదరాబాద్‌: సినిమాసినిమాకూ వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సత్యదేవ్‌. ఈసారి మరింత కొత్తగా మన ముందుకు వస్తున్నాడు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘తిమ్మరుసు’లో సత్యదేవ్‌ లాయర్‌ అవతారమెత్తాడు. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా టాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ‘కేసు గెలిచామా.. ఓడామా అన్నది కాదు ఇంపార్టెంట్‌.. ఎంత సంపాదించామన్నదే ఇంపార్టెంట్‌’ అని హీరో సత్యదేవ్‌ను ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి అంటాడు. దానికి బదులుగా.. ‘నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్‌’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో సాగే ఈ టీజర్‌ ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమాలో మధ్యతరగతికి చెందిన నిబద్ధత గల డ్యాషింగ్‌ లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అతను న్యాయాన్ని గెలిపించేందుకు ఎక్కడి వరకైనా వెళ్లే తత్వం ఉన్న లాయర్‌ అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇంతకీ న్యాయాన్ని గెలిపించడానికి ఆ లాయర్‌ ఏం చేశాడు..? ఆ క్రమంలో అతనికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి..? చివరికీ హీరో విజయం సాధించాడా లేదా..? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే మరి.! వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు చిత్రంబృందం తెలిపింది.

ఇదీ చదవండి..

ట్విటర్‌లో మోత మోగించిన ఐదు సినిమాలు..

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని