Vishwak Sen: విశ్వక్‌సేన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడా?.. వివరాలు ఆరోజే అంటూ పోస్ట్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో ఒకరైన విశ్వక్‌సేన్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అది పెళ్లి గురించేనని చాలామంది భావిస్తున్నారు.

Published : 14 Aug 2023 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) సోషల్‌ మీడియాలో పెట్టిన తాజా పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని చెప్పడమే ఇందుకు కారణమైంది. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులకు.. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞుణ్ని. జీవితంలో మరో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నానని తెలియజేసేందుకు ఆనందంగా ఉంది’’ అని విశ్వక్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. వివరాలను ఆగస్టు 15న వెల్లడించనున్నట్లు తెలిపాడు. #VishwakFamily (విశ్వక్‌ ఫ్యామిలీ) అనే హ్యాష్‌ట్యాగ్‌తోపాటు సంబంధిత ఎమోజీలు జోడించడంతో చాలామంది పెళ్లి గురించే అనుకుంటున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విశ్వక్‌సేన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘అన్నా పెళ్లి ఎప్పుడు?’, ‘సంతోషంగా ఉండండి’, ‘ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్‌ అన్నా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. ‘కొత్త సినిమా ప్రచారం అనుకుంటా’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి, విశ్వక్‌సేన్‌ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా? సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇలా పోస్ట్‌ పెట్టాడా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

బాలీవుడ్‌ నుంచి వెళ్లిపోవాలనుకున్నా: అనురాగ్‌ కశ్యప్‌

సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది మార్చిలో ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు విశ్వక్‌. అతడు నటించిన ‘బూ’ సినిమా నేరుగా ఓటీటీలో మే నెలలో విడుదలైంది. ప్రస్తుతం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari)లో నటిస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని