Pragathi: ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు?.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఆగ్రహం..

తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి ప్రగతి(Pragathi) స్పందించారు.

Updated : 30 Oct 2023 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చిన నేపథ్యంలో నటి ప్రగతి స్పందించారు. ఓ ప్రముఖ నిర్మాతను ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఆమె మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి. అవి చూడగానే ఎంతో బాధగా అనిపించింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని మరొకరి వ్యక్తిగత జీవితంపై ఇష్టమెచ్చినట్లు రాస్తారు. నేను ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటివి రాసేముందు చెక్‌ చేసుకుని.. నిజానిజాలు తెలుసుకొని రాయండి. ఒకరి గురించి రాసేటప్పుడు హద్దులు మీరకూడదు. అసలు అలాంటిది ఏదైనా ఉంటే నేను చెబుతాను కదా! అంతేగానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఆత్మగౌరవాన్ని ఇలా దెబ్బతీయడం సరైన పద్ధతి కాదు’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఈ వారం సినిమాలు నవ్విస్తాయ్‌.. భయపెడతాయ్‌..!

ఇక ప్రస్తుతం ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 100కు పైగా చిత్రాలతో మెప్పించారు. చిరంజీవి హీరోగా ఇటీవల వచ్చిన ‘భోళాశంకర్‌’లో కనిపించారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్‌లు పెడుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని