Animal: ‘యానిమల్‌’ రన్‌టైమ్‌పై ఆసక్తికర చర్చ!

రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్‌’ (Animal). దీని రన్‌టైమ్‌పై సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Published : 01 Nov 2023 11:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). తాజాగా దీని రన్‌టైమ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది.

ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్‌1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రన్‌టైమ్‌ గురించి ఓ వార్త సినీప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం నిడివి 3.20గంటలకు పైగానే అని సోషల్‌మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఇంత ఎక్కువ రన్‌టైమ్‌ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేయండి’ అని కోరుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. తాజాగా సందీప్‌ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డిసెంబర్‌ 1న రణ్‌బీర్‌ కపూర్‌ విశ్వరూపాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి’ అని చెప్పారు.

సందడిగా వరుణ్‌, లావణ్యల హల్దీ వేడుక.. ఫొటోలు చూశారా!

సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన రెండు పాటలు మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సరసన రష్మిక నటించింది. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. కంటెంట్‌, భావోద్వేగాల పరంగా ఇది చాలా పెద్ద సినిమా అని గతంలో సందీప్‌ వంగా చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని