KGF-3: ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌.. కేజీయఫ్-3 ఉండనుందా?

కేజీఎఫ్ 3 కావాలంటూ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు

Published : 15 Apr 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కేజీయఫ్-2’ మేనియా కొనసాగుతోంది. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ఇతర సినిమాలతో పోటీ లేకపోవడం, బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో యశ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే సినిమా చూసిన వారందరి నోటా ఇప్పుడు ఒకటే మాట. అదే ‘కేజీయఫ్-2’ సినిమా క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

ఎండ్‌ టైటిల్స్‌ పడే దగ్గర ఓ సన్నివేశంలో రవీనా టాండన్‌ ఆశ్చర్యంగా చూస్తూ ఓ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటుంది. దానిపై ‘కేజీయఫ్-3’ అని రాసి ఉంటుంది. ఆమె ముఖంలో గాంభీర్యం, పవర్‌ఫుల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దీనికి మరింత హైప్‌నిచ్చాయి. థియేటర్లలో ఈ సీన్‌కు విజిల్స్‌ పడుతున్నాయి. మూడో పార్ట్‌కు ఇది సంకేతమంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.‘కేజీయఫ్-3’ కావాలంటూ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్‌ నీల్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘‘మొదటి భాగంలానే రెండో భాగాన్నీ ప్రేక్షకులు ఆదరిస్తే పార్ట్‌-3 గురించి ఆలోచిస్తా’’ అంటూ ఈ దర్శకుడు స్పందించాడు. ఒకవేళ పార్ట్‌ 3 ఉన్నా అది ఇప్పుడప్పుడే సాధ్యపడే అవకాశం లేదు. అందుకు కారణం ప్రశాంత్‌ నీల్‌కు ఏర్పడిన క్రేజే. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విజయం తరవాత ఈ డైనమిక్‌ డైరెక్టర్‌ వరుస అవకాశాలతో బిజీ అయ్యాడు. అందులో ప్రభాస్‌ ‘సలార్‌’ ఒకటి. అనంతరం మరో బడా హీరోతో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడనే టాక్‌ నడుస్తోంది.  

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని