Thug Life: కమల్‌ చిత్రంలో ఆ ముగ్గురు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 12 Jan 2024 09:42 IST

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా కోసం మరో ముగ్గురు స్టార్లను రంగంలోకి దించింది చిత్ర బృందం. మలయాళ నటుడు జోజు జార్జ్‌తో పాటు యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌, కథానాయిక ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 37ఏళ్ల విరామం తర్వాత కమల్‌ - మణిరత్నం కలయిక నుంచి వస్తున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని