హిట్ కాంబో.. వరుసగా మూడోసారి?
ప్రముఖ నటుడు అజిత్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
చెన్నె: ప్రముఖ నటుడు అజిత్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘నేర్కొండ పార్వై’ ఘన విజయం అందుకోవడమే ఇందుకు కారణం. ఆ వెంటనే వినోద్‌కి మరో అవకాశం ఇచ్చారు అజిత్. అదే ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘వలిమై’ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇంకోపక్క ఇదే కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. వినోద్ దర్శకత్వంలోనే అజిత్ మరోసారి నటించేందుకు పచ్చజెండా ఊపారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. వలిమై విడుదల తర్వాత ‘అజిత్ 61’ వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇలా అజిత్ ఒకే దర్శకుడితో వరుసగా మూడు చిత్రాలు చేయడం విశేషమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.