Ala Vaikuntapuramloo: బన్నీ ఫిల్మ్‌ రిజల్ట్‌పై చరణ్‌ సినిమా రిలీజ్..!

‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి సినిమాల తర్వాత దక్షిణాది చిత్రాలకు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో సూపర్‌హిట్‌ అందుకున్న పలు సినిమాలు వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.....

Published : 19 Jan 2022 14:40 IST

ముంబయి: ‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి సినిమాల తర్వాత దక్షిణాది చిత్రాలకు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో సూపర్‌హిట్‌ అందుకున్న పలు సినిమాలను వీక్షించేందుకు బీటౌన్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఇక్కడి సూపర్‌హిట్‌ చిత్రాలు ఇప్పుడు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 26న అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన హిట్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’ హిందీలో విడుదల కానుంది. మరోవైపు, రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ హిందీ వెర్షన్‌ సైతం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని ప్రచారం సాగుతోంది.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ‘అల.. వైకుంఠపురములో’ విడుదలైన తర్వాత ఆ సినిమాకు వచ్చే వసూళ్లు, ప్రేక్షకాదరణ ఆధారంగా చేసుకుని ‘రంగస్థలం’ సినిమాను హిందీలో విడుదల చేయనున్నారని సమాచారం. ఒకవేళ బన్నీ సినిమాకు మంచి మార్కెట్‌ లభిస్తే ‘రంగస్థలం’ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని.. అంతేకాకుండా పలు తెలుగు, తమిళం స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని