Ali tho Saradaga: మా నాన్న ఉన్నా లేనట్టే: శ్రీవాణి

తనకు తండ్రి ఉన్నారని.. అయితే ఆయన ఉన్నా లేనట్టేనని.. ఇంతవరకూ కనీసం ఒక్క డ్రెస్‌ కూడా కొనిపెట్టలేదని బుల్లితెర నటి శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు తానుండే గేటెడ్‌ కమ్యూనిటీలోకి రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా కూడా ఎవరూ లేరని..

Updated : 19 May 2021 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు తండ్రి ఉన్నారని.. అయితే ఆయన ఉన్నా లేనట్టేనని.. ఇంతవరకూ కనీసం ఒక్క డ్రెస్‌ కూడా కొనిపెట్టలేదని బుల్లితెర నటి శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు తానుండే గేటెడ్‌ కమ్యూనిటీలోకి రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా కూడా ఎవరూ లేరని.. తన జీవితంలో అంతలా ఏడ్చిన సందర్భం ఇంకోటి లేదని మరో నటి నవ్య స్వామి ఆవేదనకు గురైంది. ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో బుల్లితెర నటులు శ్రీవాణి, నవ్య స్వామి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. శ్రీవాణిని పెళ్లి గురించి అడగ్గా.. ‘మా ఆయన అడగ్గానే సీరియల్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాను. నేను వెళ్లిపోయిన తర్వాత నా స్థానంలో వేరే హీరోయిన్‌ పెట్టుకోకుండా... సీరియల్‌ మొత్తాన్నే ఆపేశారు’ అని శ్రీవాణి నవ్వుతూ బదులిచ్చింది. మధ్యలో తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని నవ్య స్వామి ఆవేదనకు గురైంది. ఈ ఎపిసోడ్ మే 24న ప్రసారం కానుంది. ప్రస్తుతానికి ఈ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని