Baby: ప్రేమంటే ఏంటో చెప్పే ‘బేబి’

‘‘బేబి’ మంచి మాస్‌ సినిమా. యువతరానికి బాగా కనెక్ట్‌ అవుతుంది. ప్రేమంటే ఏంటి? అని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన.. వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘బేబి’. సాయి రాజేష్‌ తెరకెక్కించారు.

Updated : 14 Jul 2023 14:15 IST

‘‘బేబి’ మంచి మాస్‌ సినిమా. యువతరానికి బాగా కనెక్ట్‌ అవుతుంది. ప్రేమంటే ఏంటి? అని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన.. వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘బేబి’ (Baby). సాయి రాజేష్‌ తెరకెక్కించారు. ఎస్‌కేఎన్‌ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌, దర్శకులు మారుతి, బుచ్చిబాబు సానా, వేణు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘కొంత కాలం క్రితం ఈ చిత్రం చూశా. చాలా కల్ట్‌ సినిమా ఇది. ఇందులో వైష్ణవి రియల్‌ ఎమోషన్‌ను చూపించింది. కొన్ని సీన్లలో ఆనంద్‌ నటన చూస్తే కంట్లోంచి నీరు వస్తుంది. విరాజ్‌ కూడా అద్భుతంగా చేశాడు. సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని నేను అల్లు అరవింద్‌కు అంకితమిస్తున్నా. టేబుల్‌ ప్రాఫిట్‌తో ఈ సినిమాని మేము విడుదల చేస్తున్నాం. హై ఇంటెన్స్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తీశాం’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘మీ అన్నలా మాస్‌ సినిమాలు చేయొచ్చు కదాని నన్ను అందరూ అడుగుతుంటారు. పది మందిని కొట్టడమే మాస్‌ కాదు. ప్రేమలో నిజాయితీగా ఉండటమూ నా దృష్టిలో మాసే. ఓ మెట్టు దిగి సారీ చెప్పడమూ మాసే. ఆ కోణంలో ఇదొక మాస్‌ చిత్రం. ఈ చిత్రంలో సాయి రాజేష్‌ కోణంలో ప్రేమను చూపించనున్నాం. సినిమా చూశాక కుర్రాళ్లంతా వైష్ణవితో ప్రేమలో పడతారు. నాకు ఇంత వరకు ఒక్క థియేట్రికల్‌ హిట్‌ లేదు. ఆ లోటు ‘బేబి’తో తీరనుంది’’ అన్నారు. ‘‘ఇది వాస్తవికతలోంచి పుట్టిన కథ. మన చుట్టూ ఉండేవాళ్ల కథలా ఉంటుంది’’ అంది నాయిక వైష్ణవి. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్‌, విరాజ్‌ అశ్విన్‌, విజయ్‌ బుల్గానిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు