Ante Sundaraniki: అంటే... చిత్రీకరణ పూర్తి!

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన నాని మరో సినిమాని పూర్తి చేశారు. వేసవిలో మరో రౌండ్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా ఫహాద్‌ నాయిక.

Updated : 25 Jan 2022 12:20 IST

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన నాని మరో సినిమాని పూర్తి చేశారు. వేసవిలో మరో రౌండ్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా ఫహాద్‌ నాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. రొమాంటిక్‌ కామెడీ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని కథానాయకుడు నాని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాని ఇందులో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్‌ అనే యువకుడిగా కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ కూడా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని