‘పటాన్‌’ తర్వాత ఏంటి?

‘పటాన్‌’ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ చేయనున్న సినిమా ఏంటి? దీనిపై ఎంతోకాలంగా చర్చ నడుస్తోంది. ఎంతోమంది దర్శకుల పేర్లు బయటికొచ్చాయి. అయితే ఇప్పుడు...

Updated : 11 Jan 2022 17:16 IST

ముంబయి: ‘పటాన్‌’ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ చేయనున్న సినిమా ఏంటి? దీనిపై ఎంతోకాలంగా చర్చ నడుస్తోంది. ఎంతోమంది దర్శకుల పేర్లు బయటికొచ్చాయి. అయితే ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్‌ సినిమా ఖరారైందని బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తమిళంలో ‘తేరి’, ‘మెర్సిల్‌’, ‘బిగిల్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన అట్లీ, షారుఖ్‌ కలయికపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని