Baby: ‘బేబి’ కలయిక మళ్లీ

ఈ ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘బేబి’ ఒకటి.

Updated : 21 Oct 2023 13:45 IST

ఈ ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘బేబి’ ఒకటి. పరిమిత వ్యయంతో రూపొందిన ఈ సినిమా... అగ్ర తారల సినిమాల స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. పలువురు యువ ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. విజయవంతమైన ఈ కలయికలో ఇప్పుడు మరో సినిమాకి రంగం సిద్ధమైంది. ‘బేబి’ దర్శకుడు సాయిరాజేశ్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో రూపొందనున్న ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌.కె.ఎన్‌తో కలిసి సాయిరాజేశ్‌ నిర్మిస్తున్నారు. పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వేసవి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కూర్పు: విప్లవ్‌, సహ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని