Baby: ‘బేబీ’ విడుదల ఖరారు

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 30 Jun 2023 13:53 IST

నంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’ (Baby). సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద 70అడుగుల రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘‘ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే వారం ట్రైలర్‌ విడుదల చేయనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కూర్పు: విప్లవ్‌ నైషధం, ఛాయాగ్రహణం: ఎమ్‌.ఎన్‌.బాల్‌రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు